ఎన్టీఆర్’ సినిమా audio launch NTR kathanayakudu #ntr mahanayakudu nandamuri bala krishna , vidhya balan,nithya menon,rakul preet ,rana,
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhu-AELqKE4ostCiC4orJrbq32dR8dxcdflcyAZ_Fb95nBnME_tq3kcsbQItUE7Gdcxy-SinwxcOzEbvaadmmUL_VXYCuCA_1MVVhFGEp8o_yPZVwqUqfqDoTrXQPS9tKkEk6cmPSmGEF4/s320/211218ntr-audio1.jpg)
నాన్న చేయని పాత్రల్ని కూడా నేను చేశానని నారదుడు, గౌతమీపుత్ర శాతకర్ణి పేర్లని చెప్పుకొనేవాణ్ని. అలాంటిది నాన్నగారి పాత్రనే చేస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. ఇది ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే చూడాల్సిన సినిమా కాదు, ఆబాలగోపాలమూ చూడాల్సిన సినిమా’’ అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తూ, ఎన్.బి.కె ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రాలు ‘ఎన్టీఆర్ కథా నాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’. విద్యా బాలన్ ముఖ్యభూమిక పోషించారు. క్రిష్ దర్శకుడు. సాయి కొర్రపాటి, విష్ణువర్ధన్ ఇందూరి సహనిర్మాతలు. ఎమ్.ఎమ్.కీరవాణి స్వరాలు సమకూర్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో గీతాలు, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ కుమార్తెలు గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి కలిసి ట్రైలర్‌ని ఆవిష్కరించారు. నందమూరి మోహనకృష్ణ, నందమూరి రామకృష్ణ, నందమూరి బాలకృష్ణ కలిసి పాటల్ని విడుదల చేశారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘ఇంత త్వరగా సినిమా పూర్తి కావడం, ట్రైలర్ విడుదల కావడం నమ్మశక్యంగా లేదు. ఎవరూ ఎప్పుడూ కూడా కష్టం అనుకోలేదు సెట్‌లో. ఎవరైనా నన్ను ను...