tollywood new film new year 2019 #happypongal #NTR #VVR #URI #PETTA #F2 #AMAVASA #BLANK
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhY-gMJxOuK-jurukG_iodH4neUdNLlCTT5uR-blExOWNYqQYa_wzYCuFeGxygbQ_Rg6d-ni65TwwBqBD3DDQj6inu5rmOi9-ekEY75w5XgfH05kHcgh8OdfGwx8wlTu0uceB-XpQy5_2Q/s320/Vinaya-Vidheya-Rama-Music-Review-Disappointing-Barring-One-1.jpg)
కాల గమనంలో మరో ఏడాది కరిగిపోగా, సరికొత్త ఆశలతో, ఆశయాలతో మరో సంవత్సరం ముందుకొచ్చింది. జనవరి ఫస్టు వచ్చిందంటే, వెను వెంటనే గుర్తొచ్చేది తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. రంగవల్లికలు.. కోడి పందేలు.. హరిదాసు సంకీర్తనలు.. కొత్త అల్లుళ్ల కేరింతలు.. ఇలా ఎన్నో సరదాలనూ, సంతోషాలనూ పంచుతుంది సంక్రాంతి. ప్రజలకే కాదు.. తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా ఇదే పెద్ద పండగ. తెలుగువారికి సంక్రాంతి సరదాలలో కొత్త సినిమా ఎప్పుడో చేరిపోయింది. మరి అలాంటి సంక్రాంతికి ఈసారి వెండితెరపై సందడి చేయబోతున్న చిత్రాలేంటో ఓసారి చూద్దామా! ‘యన్‌టిఆర్’తో తొలి అడుగు! తెలుగువారి అభిమాన నటుడు నందమూరి తారకరామారావు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో ఆయన చేయని పాత్రలేదంటే అతిశయోక్తికాదు. ఈసారి సంక్రాంతికి బాలకృష్ణ రూపంలో ఎన్టీఆర్ మన ముందుకు రాబోతున్నారు. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా బాలకృష్ణ టైటిల్‌రోల్ పోషిస్తున్న చిత్రం ‘యన్.టి.ఆర్.’ క్రిష్ దర్శకుడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి భాగం ‘కథానాయకుడు’ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం నుంచి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిం...