సినిమా ప్రివ్యూ టాక్: కేరాఫ్ కంచరపాలెం యువ కథానాయకుడు రానా c/o kancharapalem movie review
జీవితాల్లోంచి వచ్చిన కథలు చూపించే ప్రభావమే వేరు. థియేటర్లోకి అడుగుపెట్టిన వెంటనే మనల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళతాయి. ఆ కథలో మనల్నీ భాగం చేస్తాయి. ప్రతి భావోద్వేగం మనదే అనే భావనకి గురిచేస్తాయి. బయటికొచ్చాక ఆ పాత్రలు నేరుగా మనతోపాటే ఇంటికొస్తాయి. సరాసరి మన హృదయాల్లో తిష్ఠ వేస్తాయి. కొన్నాళ్లపాటు వెంటాడుతూ... తీయటి అనుభూతుల్ని, జ్ఞాపకాల్ని పంచుతాయి. ఇలాంటి కథలు తెలుగులో అరుదుగానే తెరకెక్కుతుంటాయి. అప్పుడప్పుడు వచ్చినా వాటికి సరైన వేదిక, ప్రచారం దొరక్క మరుగున పడిపోతుంటాయి. ‘కేరాఫ్ కంచరపాలెం’ విషయంలో మాత్రం ఆ తప్పు జరగలేదు. యువ కథానాయకుడు రానా ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో యువ కథానాయకుడు రానాని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎంతోమంది తారలు, ప్రముఖులు ఈ సినిమాని చూసి గొప్ప ప్రయత్నం అని మెచ్చుకున్నారు. కథేంటంటే: కంచరపాలెం అనే ఊళ్లో జరిగే కథ ఇది. ఆ ఊరికి చెందిన రాజు (సుబ్బారావు) ఓ అటెండర్. 49 ఏళ్లు వచ్చినా... పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తుంటాడు. వయసు మీదపడినా...