పడి పడి లేచె మనసు Padi Padi Leche Manasu movie review story #saipallavi #sharwanand #PadiPadiLecheManasu

సినిమా పేరు: పడి పడి లేచె మనసు నటీనటులు: శర్వానంద్, సాయిపల్లవి, మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియారామన్ తదితరులు సంగీతం: విశాల్ చంద్రశేఖర్ ఛాయాగ్రహణం: జయకృష్ణ గుమ్మడి కూర్పు: ఎ.శ్రీకర్‌ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కృష్ణకాంత్ నిర్మాత: సుధాకర్ చెరుకూరి దర్శకుడు: హను రాఘవపూడి సంస్థ: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ విడుదల: 21 డిసెంబరు 2018 ప్రేమకథా చిత్రాలు తీయడంలో తానెంత ప్రత్యేకమో తొలి రెండు సినిమాలతో చాటి చెప్పారు హను రాఘవపూడి. శర్వానంద్ కూడా ప్రేమకథల్లో చక్కగా ఒదిగిపోగలనని ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’తో నిరూపించారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న మరొక ప్రేమకథే ‘పడి పడి లేచె మనసు’. సాయిపల్లవి కూడా తోడవడంతో సినిమా విడుదలకి ముందే అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రచార చిత్రాలతో మరిన్ని అంచనాలు పెంచేసింది. మరి అసలు చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం పదండి... కథేంటంటే: సూర్య (శర్వానంద్) ఫుట్‌బాల్ ప్లేయర్. తొలి చూపులోనే వైద్య విద్యార్థ...