Posts

Showing posts from December, 2018

tollywood new film new year 2019 #happypongal #NTR #VVR #URI #PETTA #F2 #AMAVASA #BLANK

Image
 కాల గమనంలో మరో ఏడాది కరిగిపోగా, సరికొత్త ఆశలతో, ఆశయాలతో మరో సంవత్సరం ముందుకొచ్చింది. జనవరి ఫస్టు వచ్చిందంటే, వెను వెంటనే గుర్తొచ్చేది తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. రంగవల్లికలు.. కోడి పందేలు.. హరిదాసు సంకీర్తనలు.. కొత్త అల్లుళ్ల కేరింతలు.. ఇలా ఎన్నో సరదాలనూ, సంతోషాలనూ పంచుతుంది సంక్రాంతి. ప్రజలకే కాదు.. తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా ఇదే పెద్ద పండగ. తెలుగువారికి సంక్రాంతి సరదాలలో కొత్త సినిమా ఎప్పుడో చేరిపోయింది. మరి అలాంటి సంక్రాంతికి ఈసారి వెండితెరపై సందడి చేయబోతున్న చిత్రాలేంటో ఓసారి చూద్దామా! ‘యన్‌టిఆర్‌’తో తొలి అడుగు! తెలుగువారి అభిమాన నటుడు నందమూరి తారకరామారావు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో ఆయన చేయని పాత్రలేదంటే అతిశయోక్తికాదు. ఈసారి సంక్రాంతికి బాలకృష్ణ రూపంలో ఎన్టీఆర్‌ మన ముందుకు రాబోతున్నారు. ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా బాలకృష్ణ టైటిల్‌రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘యన్‌.టి.ఆర్‌.’ క్రిష్‌ దర్శకుడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి భాగం ‘కథానాయకుడు’ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్‌ సినీ రంగ ప్రవేశం నుంచి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే వ

ఎన్టీఆర్‌’ సినిమా audio launch NTR kathanayakudu #ntr mahanayakudu nandamuri bala krishna , vidhya balan,nithya menon,rakul preet ,rana,

Image
నాన్న చేయని పాత్రల్ని కూడా నేను చేశానని నారదుడు, గౌతమీపుత్ర శాతకర్ణి పేర్లని చెప్పుకొనేవాణ్ని. అలాంటిది నాన్నగారి పాత్రనే చేస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. ఇది ఎన్టీఆర్‌ అభిమానులు మాత్రమే చూడాల్సిన సినిమా కాదు, ఆబాలగోపాలమూ చూడాల్సిన సినిమా’’ అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన తండ్రి ఎన్టీఆర్‌ పాత్రలో నటిస్తూ, ఎన్‌.బి.కె ఫిలింస్‌ పతాకంపై  నిర్మిస్తున్న చిత్రాలు ‘ఎన్టీఆర్‌ కథా నాయకుడు’, ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’. విద్యా బాలన్‌ ముఖ్యభూమిక పోషించారు. క్రిష్‌ దర్శకుడు. సాయి కొర్రపాటి, విష్ణువర్ధన్‌ ఇందూరి సహనిర్మాతలు. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి స్వరాలు సమకూర్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో గీతాలు, ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్‌ కుమార్తెలు గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి కలిసి ట్రైలర్‌ని ఆవిష్కరించారు. నందమూరి మోహనకృష్ణ, నందమూరి రామకృష్ణ, నందమూరి బాలకృష్ణ కలిసి పాటల్ని విడుదల చేశారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘ఇంత త్వరగా సినిమా పూర్తి కావడం, ట్రైలర్‌ విడుదల కావడం నమ్మశక్యంగా లేదు. ఎవరూ ఎప్పుడూ కూడా కష్టం అనుకోలేదు సెట్‌లో. ఎవరైనా నన్ను నువ్వు

ZERO | TRAILER | TEASER | MAKING SCENES |0 FULL MOVIE |Shah Rukh Khan, ...

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/eaBtkdVKu9Q" frameborder="0" allow="accelerometer; autoplay; encrypted-media; gyroscope; picture-in-picture" allowfullscreen></iframe> ZERO | TRAILER | TEASER | MAKING SCENES |0 FULL MOVIE |Shah Rukh Khan, ...

ప‌డి ప‌డి లేచె మ‌న‌సు Padi Padi Leche Manasu movie review story #saipallavi #sharwanand #PadiPadiLecheManasu

Image
సినిమా పేరు: ప‌డి ప‌డి లేచె మ‌న‌సు న‌టీన‌టులు: శ‌ర్వానంద్, సాయిపల్లవి, ముర‌ళీ శ‌ర్మ‌, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియ‌ద‌ర్శి, ప్రియారామ‌న్ త‌దిత‌రులు స‌ంగీతం: విశాల్ చంద్ర‌శేఖ‌ర్ ఛాయాగ్ర‌హ‌ణం: జ‌య‌కృష్ణ గుమ్మ‌డి కూర్పు: ఎ.శ్రీక‌ర్‌ప్ర‌సాద్‌ సాహిత్యం: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, కృష్ణ‌కాంత్ నిర్మాత‌: సుధాక‌ర్ చెరుకూరి ద‌ర్శ‌కుడు: హ‌ను రాఘ‌వ‌పూడి సంస్థ‌: శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ విడుద‌ల‌: 21 డిసెంబ‌రు 2018 ప్రేమ‌క‌థా చిత్రాలు తీయ‌డంలో తానెంత ప్ర‌త్యేక‌మో తొలి రెండు సినిమాలతో చాటి చెప్పారు హ‌ను రాఘ‌వ‌పూడి. శ‌ర్వానంద్ కూడా ప్రేమ‌క‌థ‌ల్లో చ‌క్క‌గా ఒదిగిపోగ‌ల‌న‌ని ‘మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు’తో నిరూపించారు. ఈ ఇద్ద‌రి కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న మ‌రొక ప్రేమ‌క‌థే ‘ప‌డి ప‌డి లేచె మ‌న‌సు’. సాయిప‌ల్ల‌వి కూడా తోడవ‌డంతో సినిమా విడుద‌ల‌కి ముందే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ప్ర‌చార చిత్రాల‌తో మ‌రిన్ని అంచ‌నాలు పెంచేసింది. మ‌రి అస‌లు చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం ప‌దండి... క‌థేంటంటే: సూర్య (శ‌ర్వానంద్‌) ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌. తొలి చూపులోనే వైద్య విద్యార్థ

NTR kathanayakudu telugu movie audio launch images

Image